మంగళగిరి సమీపంలోని కాజా టోల్‌గేట్( kaza toll gate) వద్ద అగ్నిప్రమాదం జరిగింది. టోల్ రుసుము చెల్లిస్తుండగా ఒక్కసారిగా లారీ టైరు పేలింది. ఇంధన ట్యాంకుకు వ్యాపించి మంటలు భారీగా ఎగసిపడ్డాయి. లారీ డ్రైవర్, టోల్‌గేట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రాణాపాయం తప్పింది. రెండు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలార్పారు. అగ్నిప్రమాదంలో టోల్‌గేట్‌లోని 2 క్యాష్ కౌంటర్లు దగ్ధం అయ్యాయి. లారీని క్రేన్ సాయంతో టోల్‌గేట్ సిబ్బంది పక్కకు తొలగించారు. రూ.20 లక్షల నష్టం వాటిల్లినట్లు టోల్‌గేట్ నిర్వాహకుల అంచనా వేస్తున్నారు. టోల్‌గేట్ నుంచి యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండీ... solar eclipse: వలయాకారంలో సూర్యుడు కనువిందు