గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం గాంధీనగరంలోని ఓ చెరకుతోటలో అగ్ని ప్రమాదం జరిగింది. శివారెడ్డి అనే రైతు 12 ఎకరాలు కౌలుకు తీసుకుని చెరకు సాగు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయంలో చెరకు తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎండిన చెరకు ఆకులు ఉండటంతో త్వరగా మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది..మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 5 ఎకరాల మేర చెరకు పంట అగ్నికి ఆహుతైంది. ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.
ఇదీ చదవండి: రూ. 10 లక్షల విలువైన 34,875 ఖైనీ ప్యాకెట్లు పట్టివేత