రామేశ్వరం నుంచి ఫైజాబాద్ వెళ్తున్న శ్రద్ధసేతు ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలుకు ప్రమాదం తప్పింది. డీ-1 బోగి చక్రాలకు బ్రేకులు పట్టేయటంతో మంటలు చెలరేగాయి. గుంటూరు జిల్లా నిడుబ్రోలు స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై సకాలంలో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో నిడుబ్రోలు రైల్వేస్టేషన్లో 30 నిమిషాలు రైలు ఆగిపోయింది. బోగి చక్రాల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రైలు బయలుదేరింది. సాయంత్రం 7గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
ఇదీచదవండి.