Fire Accident in guntur: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పోనుగుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. రోజూ లాగే పాఠశాల ముగిసిన అనంతరం.. తాళాలు వేసి సిబ్బంది ఇంటికి వెళ్లారు. ఇవాళ సాయంత్రం బడిలో ఉన్న స్టోర్ రూం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పాత చెక్క బల్లాలు, కుర్చీలు, క్రీడా సామగ్రి, పాత పుస్తకాలు, పాత పరీక్ష పేపర్లు దగ్ధమయ్యాయి. గ్రామంలోని ఆకతాయిలు ప్రతిరోజూ పాఠశాల సమయం ముగిసిన అనంతరం అక్కడకి వస్తుంటారని.. వారే నిప్పు పెట్టుంటారని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫిరంగిపురం పోలీసులు వివరాలు సేకరించి.. కేసు నమోదు చేశారు. ప్రమాదంలో సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
గన్నవరంలో ఓ పాఠశాల ఆవరణలో మంటలు..
కృష్ణా జిల్లా గన్నవరంలో.. ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణలో పార్క్ చేసిన వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పాఠశాల నివేశ స్థలాలకు దూరంగా ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి:
CAR ACCIDENT : చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ప్రమాద సమయంలో వాహనంలో ఐదుగురు..?