గుంటూరు జిల్లా నరసరావుపేట పాతురి శివాలయం వద్ద.. మూడంతస్తుల భవనంలో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం సంభవించింది. మూడో అంతస్తులో కార్లలో వాడే ఫేర్‌ఫ్యూమ్ నిల్వలు ఉన్నాయి. వాటికి మంటలు అంటుకుని సీసాలు పేలిపోయాయి. ఈ శబ్ధాలకు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో లక్షల్లో ఆస్తినష్టం జరిగిందని బాధితుడు దిలీప్ తెలిపారు.
ఇదీ చదవండి: గురుగ్రామ్‌లో మరో నిర్భయ ఘటన