గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లి గ్రామంలో నిల్వ ఉంచిన బాణాసంచా పేలడంతో ముప్పాళ్ల హరిబాబు అనే వ్యక్తి ఇల్లు దగ్ధమైంది. గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంట్లో నిల్వ ఉంచిన బాణాసంచాకు నిప్పు అంటుకొని ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణా నష్టం జరగకపోవటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి : కటకటాల్లో.. వేధింపుల వడ్డీ వ్యాపారి