గుంటూరు లాడ్జి సెంటర్లోని ఇండియన్ పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ బుల్లెట్ బైకులో పెట్రోల్ నింపుతుండగా ట్యాంక్ నిండిపోయి ఇంజన్ మీద పడింది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైకు సగానికిపైగా మంట్లలో దగ్ధమైంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నిత్యం రద్దీగా ఉండే లాడ్జి సెంటర్‌లో అగ్నిప్రమాదం జరగడం వల్ల స్థానికులు కంగారు పడ్డారు. మంటలు అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి.. డీజీపీకి ఎస్‌ఈసీ లేఖ