వెలగపూడిలో జరిగిన ఘర్షణలో మొత్తం 36 మందికి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. మరియమ్మ కుమారుడు మెండెం బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 147, 148,302, 324, 109 కింద కేసులు నమోదు చేశారు. ఇక.. నిందితుల జాబితాలో నందిగం సురేశ్ పేరు చేర్చాలనే డిమాండ్ చేస్తూ.. మరియమ్మ బంధువులు మృతదేహంతో ఆందోళన చేపట్టగా.. వారిని కలిసిన హోం మంత్రి సుచరిత.. సరేనని హామీ ఇచ్చారు.
అలాగే... 10లక్షల పరిహారానికి సంబంధించిన చెక్కుని అందజేశారు. హోం మంత్రి హామీతో ఆందోళన విరమించిన బంధువులు మరియమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు... మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదులోని పేర్లను యథాతథంగా ఉంచారు. ఎంపీ నందిగం సురేశ్ పేరును మాత్రం అందులో చేర్చలేదు. ఎంపీ ప్రోద్బలంతో దాడి జరిగిందని, తమ పల్లెలో చాలామందిని హతమార్చాలని చూస్తున్నారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నా.. పోలీసులు పట్టించుకోలేదు.
ఇదీ చదవండి:
వెలగపూడిలో మరోసారి ఉద్రిక్తత.. మరియమ్మ మృతదేహంతో ఆందోళన