ETV Bharat / state

Fever Survey: కరోనా కట్టడికి ముమ్మరంగా జ్వర సర్వే

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది జ్వర సర్వే(Fever Survey) చేపట్టారు. ఇందులో భాగంగా వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి, జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. కొవిడ్ అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించటం ద్వారా.. కరోనా వైరస్​ను కట్టడి చేయవచ్చని అధికారులు వెల్లడించారు.

fever survey for decrease corona cases in guntur district
గుంటూరులో జ్వర సర్వే
author img

By

Published : May 27, 2021, 6:37 PM IST

రాష్ట్రంలో కరోనా కేసుల కట్టడికి వైద్యారోగ్యశాఖ సిబ్బంది జ్వర సర్వే(Fever Survey) నిర్వహిస్తున్నారు. ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అనారోగ్యంతో బాధపడుతున్నవారి వివరాలు సేకరిస్తున్నారు. గుంటూరు నగరంలో ఈ నెల 15న జ్వర సర్వే(Fever Survey) ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు 5వేల మందికి పైగా అనుమానితుల్ని గుర్తించారు. వారికి ర్యాపిడ్ యాంటీజెన్ కిట్ల ద్వారా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 900మందికి పైగా కరోనా బారిన పడినట్లు గుర్తించారు.

పాజిటివ్‌ వచ్చిన వారి వివరాలను ఏఎన్‌ఎంలు సంబంధిత వైద్యాధికారికి తెలియజేస్తున్నారు. రోగి ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, హోం ఐసోలేషన్, కొవిడ్‌ కేర్‌ సెంటర్, ఆస్పత్రికి తీసుకెళ్లడం వంటి చర్యలు చేపడుతున్నారు. హోం ఐసోలేషన్​లో ఉండే వారికి మందులు అందజేస్తున్నారు. జ్వర సర్వే(Fever Survey) ద్వారా కొవిడ్ బాధితుల్ని తొలి దశలోనే గుర్తిస్తున్నందున వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించకుండా కట్టడి చేయవచ్చని అధికారులు వివరించారు.

ఇదీచదవండి.: యువకుడిని చితకబాదిన ఎస్సై... వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.