గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల దుకాణాలను వ్యాపారులు మూసివేశారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా డీలర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి 10 రోజుల పాటు దుకాణాలు మూసివేయనున్నారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి తెరవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోనున్నారు.
కొందరు వ్యాపారులు, దుకాణాల్లో పనిచేసే కూలీలు సైతం కరోనా బారిన పడ్డారు. షాపులు తెరిస్తే మరింత ఎక్కువ మంది కొవిడ్ కు గురయ్యే అవకాశముంది. అదే జరిగితే రాబోయే ఖరీఫ్ సీజన్ కు ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఎరువులు, విత్తనాల దుకాణాలు మూసివేయాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: