ETV Bharat / state

కొవిడ్​ బారిన పడి తండ్రీ కుమారుడు మృతి - తెనాలి తాజావార్తలు

కొవిడ్​ బారిన పడి... తండ్రీ కుమారుడు మరణించిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది. ఇంటిల్లిపాదికీ వైరస్​ సోకిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

కరోనాతో మృతి
కరోనాతో మృతి
author img

By

Published : May 18, 2021, 1:14 PM IST

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నన్నపనేని విష్ణు మోహన్ రావు (65), అతని కుమారుడు కృష్ణమోహన్ (34) కరోనా సోకి మరణించారు. ఇరవై రోజుల క్రితం కుటుంబసభ్యులందరూ కొవిడ్​ బారిన పడగా.. తండ్రీ, కుమారుడిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పన్నెండు రోజుల క్రితం కృష్ణ మోహన్ ప్రాణాలు విడిచారు. కొవిడ్​ నుంచి కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలో విష్ణు మోహన్ రావు నిన్న మృతి చెందారు.

విష్ణుమోహన్ రావు.. ఉద్యోగ విరమణ అనంతరం కేఎల్​యూలో సహాయ ఆచార్యులుగా సేవలందిస్తున్నారు. కృష్ణమోహన్ సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​గా పనిచేసేవాడు. విష్ణు మోహన్​రావు సతీమణి, అత్తా, కోడలు, పది నెలల బాబు కూడా కరోనా బారిన పడి.. కోలుకున్నారు. మృతుని అంత్యక్రియలు తెనాలిలో పూర్తి చేశారు. మరణించిన వ్యక్తి తెదేపా నాయకురాలు నన్నపనేని రాజకుమారి భర్త ముకుందరావు సోదరుడు. కొవిడ్​.. తమ కుటుంబంలో విషాదం నింపిందని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

'టెలీమెడిసిన్‌ ద్వారా కరోనా రోగులకు వైద్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.