గుంటూరు జిల్లా పెదకూరపాడులో నకిలీ విత్తనాలతో మిర్చి రైతులు నష్టపోయారు. పంట వేసి 60 రోజులు అయినా కాయలు కనిపించకపోవడంతో చాలా చోట్ల పంటను పీకేశారు. ఓ కంపెనీ విత్తనాలను వేయడంవల్ల సుమారు 400 ఎకరాల్లో మిర్చి పంట దెబ్బ తిందని రైతులు చెబుతున్నారు.
కాయలు రాకపోవడం, ఎదుగుల లేకపోవడంతో పాటు ఆకులు ముడతలు పడి పంట నష్టపోయామని చెప్పారు. కంపెనీ ఇచ్చిన నకిలీ విత్తనాల వల్లే దెబ్బతిన్నామని గగ్గోలు పెడుతున్నారు. పంటకు తగిన నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి:
నాణ్యమైన ఎరువన్నారు.. నమ్మి కొన్న రైతుల నోట్లో బూడిద కొట్టారు