ETV Bharat / state

దిల్లీలో అన్నదాతల ఉద్యమం.. వామపక్ష పార్టీలు, రైతు సంఘాల మద్దతు - రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాల నాయకులు నిరసన

దిల్లీలో అన్నదాతలు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, రైతు సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. రైతన్నలు చేపట్టిన ఉద్యమానికి సంఘీభావంగా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు.

farmers union and socialist partys  agitation
రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, రైతు సంఘాల నాయకులు నిరసన
author img

By

Published : Dec 3, 2020, 5:47 PM IST

దేశ రాజధానిలో కర్షకులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా వామపక్ష పార్టీలు, రైతు సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని... డిమాండ్ చేస్తూ అన్నదాతలు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీ చేపట్టారు.

గుంటూరు జిల్లాలో...

దిల్లీలో రైతుల ఉద్యమానికి సంఘీభావంగా గుంటూరులో వామపక్ష పార్టీలు, రైతు సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. భాజపా ప్రభుత్వం రైతుల హక్కులను కాలరాసేలా నూతన వ్యవసాయ చట్టాలను చేసిందని.. వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

చిత్తూరు జిల్లాలో..

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో వామపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. రైతులకు ఈ చట్టాలు ఉపయోగపడవని... అత్యవసర పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి కర్షకుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశాయి. దేశానికి అన్నం పెట్టే రైతన్న పట్ల భాజపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని నేతలు ఆవేదన చెందారు.

కర్నూలు జిల్లాలో...

దిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా కర్నూలు జిల్లా నంద్యాలలో వామపక్ష పార్టీలు వ్యవసాయ, కార్మిక సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కొత్త చట్టాలతో కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

ప్రకాశం జిల్లాలో..

తమ సమస్యలపై పోరాటం చేస్తున్న రైతులపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని ఖండిస్తూ... ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సీఐటీయూ, కేవిపీఎస్, డివైఎఫ్ఐ, ఏ.ఐ.డబ్ల్యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చీరాల, అద్దంకి, ఒంగోలులో కార్మికులు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

నెల్లూరు జిల్లాలో...

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని కార్పోరేట్ శక్తులకు అప్పగించే దుర్మార్గపు ఆలోచన కేంద్రం వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.

అనంతపురం జిల్లాలో...

దిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లాలోని హిందూపురం, కదిరి ప్రాంతాల్లో చిలమత్తూరులో సీఐటీయూ నాయకులు, అన్నదాతలు నిరసన బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో...

దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా.. శ్రీకాకుళం వ్యాప్తంగా వామపక్షాలు, రైతుసంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రైతు మనుగడను దెబ్బతీసే మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆప్రజాస్వామికంగా ఆమోదించుకున్న వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలన్నారు.

విశాఖ జిల్లాలో...

దిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా విశాఖ జిల్లా పాయకరావుపేట, నర్సీపట్నం ప్రాంతాల్లో వామపక్షాలు, రైతుసంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలు, 2020 విద్యుత్ సవరణ బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. రైతులు నష్టపోయో విధంగా భాజపా ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఆరోపించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ దిల్లీలో పోరాడుతున్న రైతులకు సంఘీభావంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అన్నదాతలు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అన్నం పెట్టే అన్నదాతలపై పోలీసు చర్యలు అన్యాయమన్నారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ... రైతుల సమస్యలు పరిష్కరించకుండా ఆలస్యం చేయడం తగదన్నారు.

విజయనగరం జిల్లాలో...

కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతులకు నష్టం కలిగించే 3 వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు-2020ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండీ...సలాం పోరాట సమితి చలో అసెంబ్లీ అడ్డగింత.. నేతల గృహనిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.