ETV Bharat / state

అమ్మకానికి రాజధాని భూములు.. మహిళా రైతుల నిరసన - సీఆర్​డీఏ

Capital Farmers Protest : రాజధాని అమరావతి కోసం రైతులిచ్చిన భూముల్ని అమ్మేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సీఆర్​డీఏ పరిధిలోని 14 ఎకరాలను వేలం వేసేందుకు అనుమతిచ్చింది. ఆ మేరకు అధికార యంత్రాంగం భూముల ధరలను సైతం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. సర్కారు తీరుని తప్పుబడుతూ రాజధాని గ్రామాల్లో నల్లరిబ్బన్లతో నిరసన తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న భూములను అమ్మడం ధిక్కరణ కిందకి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

రాజధాని భూముల్ని అమ్మడంపై ఆగ్రహం
రాజధాని రైతులు
author img

By

Published : Mar 8, 2023, 8:56 PM IST

Updated : Mar 9, 2023, 7:31 AM IST

రాజధాని భూముల్ని అమ్మడంపై ఆగ్రహం..కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని మహిళ రైతుల నిరసన

Capital Farmers Protest : అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయకుండా సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పుడా వ్యవహారం నడుస్తుండగానే సీఆర్​డీఏ ప్రాంతంలో భూములను అమ్మకానికి పెట్టింది. తొలి విడతగా 14 ఎకరాలు విక్రయించాలని నిర్ణయించింది. ఎకరం 5 కోట్ల 94 లక్షల చొప్పున నవులూరు సమీపంలో పదెకరాలు, ఎకరానికి 5 కోట్ల 41 చొప్పున పిచ్చుకలపాలెం వద్ద సీడ్‌ యాక్సెస్‌ రహదారికి ఆనుకుని ఉన్న మరో నాలుగు ఎకరాలను విక్రయించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు గుంటూరు కలెక్టర్‌ ఎం.వేణు గోపాల్‌ రెడ్డి రెవెన్యూ, సీఆర్​డీఏ అధికారులతో సమావేశం నిర్వహించారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రాజధాని రైతులు : పిచ్చుకలపాలెం వద్ద భూమిని గతంలో బీఆర్‌ శెట్టి సంస్థ మెడికల్‌ కాలేజీ కోసం కేటాయించారు. 12 వందల కోట్లకు పైగా పెట్టుబడి పెడతామని ఆ సంస్థ హామీ ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రాజధాని నిర్మాణం నిలిచిపోవడంతో వారు పనులు ప్రారంభించలేదు. ఇప్పుడా భూముల్ని ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. రాజధానిలో తట్ట మట్టి వేయకుండా భూముల్ని ఎలా విక్రయిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు రాజధాని గ్రామాల్లోని శిబిరాల్లో నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు.

అమరావతే రాజధాని అంటూ హైకోర్టు స్పష్టమైన తీర్పు : ఏడాది క్రితం కూడా రాజధాని భూముల్ని ప్రభుత్వం అమ్మకానికి పెట్టినా వివిధ కారణాలతో వేలం నిలిచిపోయింది. ఇప్పుడు మరోసారి భూముల వేలానికి సిద్ధమైంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు నిలిపివేయటంతో అభివృద్ధి ఆగిపోయింది. కనీసం రైతులకు ఇచ్చిన ప్లాట్లను కూడా అభివృద్ది చేయలేదు. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చి ఏడాది గడిచినా దాన్ని అమలు చేయకుండా సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఈ కేసు విచారణ జరగాల్సి ఉంది. ఈ తరుణంలో రాజధాని కోసం ఇచ్చిన భూముల్ని అమ్మకానికి పెట్టడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

అనుమానాలు వ్యక్తం చేస్తున్న రాజధాని రైతులు : రాజధానికి స్థలాలు ఇచ్చిన వారిని రెచ్చగొట్టేందుకు భూముల అమ్మకం వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారా లేక తమ అనుయాయులకు భూములను కట్టబెట్టేందుకు కుట్ర పన్నారా అని రాజధాని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

"రాష్ట్రంలో ఇప్పుడు రాజధాని లేనప్పుడు మీరెట్ల అమ్ముకుంటారు. ఎవరి సొమ్ము అని అమ్ముకుంటారు జగన్ మోహన్ రెడ్డి గారు. ఇక్కడ రాజధాని నిర్మించండి. అభివృద్ధి చెయ్యండి. మేమిచ్చిన భూమిల్ని అమ్మడం మేము ఒప్పుకోం.. కోర్టుకైనా మళ్లీ వెళతాం. " - మహిళ రైతు, అమరావతి

"మేము ఇప్పటికి మూడు సంవత్సారాల పైనుంచి ఉద్యమం చేస్తున్నాం. ఈ గుడ్డి ప్రభుత్వానికి అయితే ఎక్కడా కనువిప్పు కలగడం లేదు. మహిళా దినోత్సవం రోజు స్పీచ్​లు ఇవ్వడం కాదు." - మహిళ రైతు, అమరావతి

"దేనికి అమ్ముతున్నారండి.. ఏమైనా డెవలప్ చేయడానికి అమ్ముతున్నారా? అది లేదుగా రాష్ట్రం అభివృద్ధి చేయడానికి చేయటం లేదుగా. దోచుకోవడానికి దాచుకోవడానికి చేస్తున్నారు. రైతులు మనోభావాలతో ఆడుకోవద్దు. " - మహిళ రైతు, అమరావతి

ఇవీ చదవండి

Last Updated : Mar 9, 2023, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.