అనుమతి లేని మిర్చి విత్తనాలను రైతులకు విక్రయించి వారిని రోడ్డుపాలు చేసిన కళాషా కంపెనీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ... గుంటూరు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు గ్రామంలో సుమారు 400 ఎకరాలలో రైతులు మిర్చిపంట వేసి నష్టపోయారని అన్నారు.
తక్షణమే నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే నకిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కళాషా కంపెనీ కి చెందిన మిరప విత్తనాలు వాడటం వలన.. మిరప పంటకు బొబ్బర తెగులు వచ్చి పంట అంతా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ...'
దాడి కుటుంబం మా స్థలాన్ని ఆక్రమించింది.. చంపేస్తామని బెదిరిస్తోంది'