అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, ఉద్ధండరాయునిపాలెం, నెక్కల్లు, దొండపాడులో రైతులు, మహిళలు నిరసన దీక్షలు కొనసాగించారు. భౌతిక దూరం పాటిస్తూ నిరసనలు చేపట్టారు. అమరావతి, విశాఖ ఉక్కుకు మద్దతుగా నినాదాలు చేశారు. అమరావతి మహిళా రైతుల బాధలపై షర్మిల స్పందించాలని డిమాండ్ చేశారు. సమయం ఇస్తే వచ్చి స్వయంగా కలిసి తమ బాధలను తెలియజేస్తామని రైతులు తెలిపారు. మీ అన్న వల్లే తామంతా రోడ్డున పడ్డామని..షర్మిల దృష్టికి తీసుకెళ్తామని రైతులు, మహిళలు అన్నారు.
ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి: టికాయత్