రాజధాని వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై అమరావతి రైతుల్లో ఆగ్రహజ్వాలలు కొనసాగుతున్నాయి. అమరావతిని సాధించేవరకూ వెనక్కి తగ్గేది లేదంటూ పట్టుసడలని పోరుతో రాజధాని గ్రామాల్లో గళం వినిపిస్తున్నారు. తుళ్లూరు, మందడంతోపాటు 29 గ్రామాల్లోనూ 233వ రోజు రైతులు, మహిళలు మహాధర్నాలో పాల్గొన్నారు.
తుళ్లూరులో రైతులు, మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. మెడలకు ఉరితాళ్లు బిగించుకుని సామూహిక కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతి, గవర్నర్‌ను వేడుకున్నారు. రాజధాని తమ పరిధిలోనిది కాదని... రాష్ట్ర పరిధిలోనిదేనంటూ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడాన్ని రైతులు తప్పుబట్టారు. రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించనప్పుడు నిధులు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు. ప్రాణాలు ఒడ్డైనా... రాజధాని అమరావతిని కాపాడుకుంటామని రాజధాని రైతులు, మహిళలు తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి