రాజధాని కోసం రైతులు చేస్తున్న నిరసనల్లో మీడియా ప్రతినిధులపై జరిగిన దాడి దురదృష్టకరమని అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) తెలిపింది. మీడియా ప్రతినిధులు కూడా రైతుల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని పేర్కొంది. మీడియాపై జరిగిన దాడిని రైతులు ఖండిస్తూ లేఖ విడుదల చేసింది. గత 10 రోజులుగా రాజధాని ప్రాంత రైతులు, రైతు కూలీలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారన్నారు. మహిళలను కించపరిచే విధంగా వారిని పెయిడ్ ఆర్టిస్టులని, బిర్యానీ కోసం వచ్చారని వ్యాఖ్యలు చేసి రైతుల త్యాగాలను అపహాస్యం చేయవద్దని మీడియాను జేఏసీ కోరింది. రైతుల ఉద్యమానికి మీడియా అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగకూడదని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి :