గుంటూరు జిల్లా పెదనందిపాడు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. పత్తి నాణ్యత బాగా లేదంటూ కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు-బాపట్ల రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ ఏడాది పత్తి పంటలో తాము తీవ్రంగా నష్టపోయామని...గులాబీ రంగు పురుగు తమను ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పండిన కొద్దిపాటి పత్తిని మార్కెట్కు తీసుకువస్తే నాణ్యత పేరుతో వంకలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమ పత్తిని కొనుగోలు చేయకపోతే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: