ETV Bharat / state

మార్కెట్ యార్డులో పసుపు రైతుల ఆందోళన

అన్ని మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం కంటితుడుపు చర్యేనని రైతులు ఆరోపిస్తున్నారు. తమ దగ్గర పసుపు కొనుగోలు చేయకుండా వ్యాపారస్తుల దగ్గరే కొనుగోలు చేస్తున్నారని వేమూరు మార్కెట్ యార్డ్​లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : May 29, 2020, 12:17 PM IST

guntur district
మార్కెట్ యార్డులో పసుపు కొనుగోలు చేయటం లేదని రైతులు ఆందోళన

గుంటూరు జిల్లా వేమూరు వ్యవసాయ మార్కెట్​లో ప్రభుత్వం పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పంట అమ్ముకోవాలంటే ఈ క్రాప్​ ఉండాలని.. గోతాలు తీసుకోవాలని.. సీరియల్ ప్రకారమే కొనుగోలు చేస్తామని అధికారులు అంటున్నారని రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి 30 రోజులు అయినా కూడా తమ దగ్గర పసుపు ఇంకా కొనుగోలు చేయలేదని రైతులు వాపోతున్నారు. తమ పేరు మీద వ్యాపారస్తులే పంట అమ్ముకుంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత సంవత్సరం చేసే ఖర్చు ఎంత.. ఈ క్రాప్​ బుక్ చేసుకున్న రైతు దగ్గర పసుపు కొనుగోలు చేస్తే పంట ఎంతో లెక్క తేలుతుందని రైతులంటున్నారు. కానీ, రాజకీయ నాయకుల కనుసైగల్లోనే పసుపు కొనుగోలు చేస్తున్నారని రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇది చదవండి 'కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.