రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావుకు పుత్ర వియోగం కలిగింది. ఆయన కుమారుడు జయరాం శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. రెండు సంవత్సరాల క్రితమే జయరాం భార్య హిమకుమారి అనారోగ్యంతో మృతిచెందడంతో వెంకట్రావు కుటుంబంలో విషాదం అలుముకుంది.
జయరాం గుంటూరు జిల్లా తెనాలిలో ఎల్ఎల్బీ పూర్తి చేసి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అనంతరం తెనాలి కోర్టులో ప్రాక్టీస్ చేశారు.
యడ్లపాటి జయరాం మరణంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యడ్లపాటి వెంకట్రావును చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. జయరాం మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పరామర్శించారు. జయరాం భౌతిక కాయానికి నివాళులర్పించారు.
ఇదీచదవండి.