గుంటూరు జిల్లా ఈపూరులో మృతి చెందిన వారి పేరు మీద ఇసుక అమ్మకాలకు అనుమతులిచ్చిన ఘటనపై... ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని మాజీమంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఏపీఎండీసీ ప్రమేయం లేకుండా విశాఖకు చెందిన ఓ కంపెనీ పేరుతో... కోట్లాది రూపాయల ఇసుక అక్రమ రవాణా జరిగిందని నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. దరఖాస్తు చేసిన నాలుగు రోజుల్లోనే అధికారులు అనుమతులిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పది రోజుల్లో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని... లేకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
ఇదీచదవండి.