గుంటూరు జిల్లా రేపల్లె మండలం వాకావారిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పొలం పనికి వెళ్లి పాముకాటుకు ఓ రైతు మృతి చెందాడు. వాక రామకృష్ణ నారుమడిలో పని చేస్తుండగా పాము కాటు వేసింది. వెంటనే సమాచారం తెలుసుకున్న కుంటుంబసభ్యులు రేపల్లె ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేస్తుండగా రామకృష్ణ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొండారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి