ETV Bharat / state

Protest: పోలీసులు వేధిస్తున్నారంటూ.. కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆందోళన

గుంటూరు జిల్లా సీతానగరం రెండో లైన్‌కు చెందిన ఓ కుటుంబం (family suicide attempt) ఆందోళనకు దిగింది. కేసు విషయమై పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ.. కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది.

కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆందోళన
కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆందోళన
author img

By

Published : Nov 26, 2021, 11:37 AM IST

Updated : Nov 26, 2021, 10:33 PM IST

కుటుంబ సభ్యులతో కలసి.. ఓ మహిళ ఆత్మహత్యాయత్నం (family suicide attempt news) చేసిన ఘటన గుంటూరులో కలకలం రేపింది. సీతానగర్ 2వ లైన్ కి చెందిన మిరియాల సుజాత.. భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పాత గుంటూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని..పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. తనపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని సుజాత వాపోయింది. "నా పైనా, నా కుమారుల పైనా దాడి చేసి తిరిగి ఎదురు కేసు పెట్టారు. పోలీసులు విచారణ పేరుతో వేధిస్తున్నారు. పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేశాం." అని వాపోయింది.

కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆందోళన

ఆరోపణల్లో వాస్తవం లేదు: సీఐ

కేవలం పోలీసులను బెదిరించేందుకే సుజాత ఇలా చేశారని పాత గుంటూరు సీఐ వాసు అన్నారు. ప్రశాంతి అనే మహిళ...సుజాతపై ఫిర్యాదు చేశారని దర్యాప్తులో భాగంగా పోలీస్‌స్టేషన్‌కు పిలిచినా రాకపోగా ఆత్మహత్యాయత్నం చేశారని తెలిపారు. అక్రమ మద్యానికి సంబంధించి..సుజాతపై గతంలోనూ కేసు నమోదైనట్లు సీఐ వివరించారు.

ఇదీ చదవండి: Mother Murdered by Son: పెళ్లి చేయట్లేదన్న కోపంతో.. తల్లిని హతమార్చిన కొడుకు

Last Updated : Nov 26, 2021, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.