గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కొందరు దొంగ ఓట్లు వేస్తూ దొరకడంతో.. 26వ డివిజన్ అంకిరెడ్డిపాలెంలో అలజడి రేగింది. ఇందుకు ప్రయత్నించిన వైకాపా కార్యకర్తలను స్వతంత్ర అభ్యర్థులు పట్టుకున్నారు. వారిని అరెస్టు చేయకుండా పోలీసులు మౌనంగా ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల తీరును నిరసిస్తూ.. ఇతర అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించారు. వారు న్యాయంగా పని చేయాలని నినాదాలు చేశారు. విద్యానగర్ 43వ డివిజన్లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలోనూ ఇదే విధంగా దొంగ ఓట్లు వేస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు.
ఇదీ చదవండి: