ETV Bharat / state

సూర్యలంక నుంచి దక్షిణాది రాష్ట్రాలకు మత్తి చేప

author img

By

Published : Jan 14, 2021, 9:20 AM IST

సూర్యలంక తీరం మత్తి చేపలతో కళకళలాడుతోంది. ఇక్కడి సముద్రంలో మత్తి, కవర రకం చేపలు ఎక్కువగా లభిస్తుండటంతో...వీటిని దక్షిణాధి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.

Suryalanka
సూర్యలంక నుంచి దక్షిణాది రాష్ట్రాలకు మత్తి చేప

గుంటూరు జిల్లా సూర్యలంక తీరం మత్స్య సంపదతో కళకళలాడుతోంది. ఇక్కడి సముద్రంలో మత్తి, కవర రకం చేపలు విస్తారంగా లభిస్తున్నాయి. మత్స్యకారుల నుంచి వ్యాపారులు వీటిని కొని కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. గతంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లినా వలలో పడక కనీసం డీజిల్‌ ఖర్చులు రాక మత్స్యకారులు నష్టపోయేవారు. చేపల ఉత్పత్తి తగ్గి 2017, 2018లో 2నెలలు వేట కూడా సరిగా సాగలేదు. సముద్రంలో 50 నుంచి 60 కి.మీ.లోపలికి వెళ్తేనే చేపలు లభించేవి. 20శాతం మంది మత్స్యకారుల వద్దే అంత దూరం వెళ్లి వేట సాగించే మర పడవలున్నాయి.

80 శాతం మంది 30 కి.మీ.లోపే వలలు వేస్తున్నారు. వర్షాలు బాగా కురవటంతో వరదలు వచ్చి నదులు, కాల్వల నుంచి మంచినీరు సముద్రంలో ఎక్కువగా కలిసింది. దీని ప్రభావంతో మత్తి చేపల ఉత్పత్తికి అనువైన వాతావరణమేర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబరు నుంచి సాగరంలో వేటకు వెళ్లిన వారికి వలల నిండా చేపలు పడుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా సూర్యలంక తీరంలోనే ఈ రకం చేపలు లభిస్తున్నాయి. వీటిలో పెద్దవాటిని తినటానికి, చిన్నవాటిని నూనె తీసేందుకు వినియోగిస్తారు. ఇక్కడ రోజూ 100నుంచి 200 టన్నుల మత్తి, కవర రకం చేపలను పడుతున్నారు.

రోజుకు 2 నుంచి 4 కంటెయినర్లు

నిజాంపట్నం మినహా ఇతర ప్రాంతాల్లో మత్తి చేపల ప్రాసెసింగ్‌, రవాణాకు సరైన సదుపాయాలు లేవు. చేపలను ట్రాక్టర్లలో తీసుకొచ్చి సూర్యలంక- బాపట్ల ఆర్‌అండ్‌బీ రహదారిపై గుట్టలుగా పోసి కంటెయినర్ల ద్వారా తమిళనాడులోని చెన్నై, కేరళలోని కొచ్చిన్‌, కర్ణాటకలోని మంగళూరుకు పంపుతున్నారు. రోజూ 2 నుంచి 4 కంటెయినర్లలో ఎగుమతవుతున్నాయి. ఫిబ్రవరి వరకు వేట కొనసాగుతుంది. ఒమెగా-3, బీ12, డీ విటమిన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉన్న ఈ చేపలను ప్రధానంగా కేరళలో ఎక్కువగా తింటారు. చేపల ప్రాసెసింగ్‌ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్లాట్ఫారాలు, షెడ్డుల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఎన్‌ఏఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనంత నగేష్‌బాబు తెలిపారు. మత్స్యకారులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చేయూతనందిస్తామన్నారు.

గుంటూరు జిల్లాలో వేట పడవలు- 2,000
సముద్ర ఉత్పత్తుల ద్వారా ఏటా ఆదాయం అంచనా రూ.250 కోట్లు
మత్తి చేపల వాటా రూ.7080 కోట్లు

ఇదీ చదవండి:

ఈసారి ఎద్దును ఆపుతారా? కొమ్మును వంచుతారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.