తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాస ప్రాంతంలో ఉంటున్న పేదలను తరలించేందుకు రంగం సిద్ధమవుతోంది. బకింగ్‌హామ్ కాలువ పక్కనే ఉంటున్న అమరానగర్ వాసులకు ప్రత్యామ్నాయ స్థలాలు ఇచ్చేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్, అధికారులు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థలాలను పరిశీలించారు.
మంగళగిరి మండలం ఆత్మకూరు, తాడేపల్లి మండలం ఇప్పటం పరిధిలోని 12 ఎకరాల భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసి, లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఒక్కో ఎకరాకి రూ.96 లక్షలు చెల్లించాలని రైతులు కోరగా..ఉన్నతాధికారులతో చర్చించాక ధర నిర్ణయిస్తామని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ చెప్పారు.
ఇదీ చదవండి: తెదేపాను గెలిపించి సీఎం జగన్‌కు బుద్ధిచెప్పాలి: కాలవ