వైకాపా నాయకుల వద్ద పేరు కోసం గొడవలతో సంబంధం లేకున్నా తెదేపా కార్యకర్తలపై పోలీసులు క్రిమినల్ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట సబ్జైల్లో ఉన్న తెదేపా కార్యకర్తలను ప్రత్తిపాటి, చదలవాడ అరవిందబాబు పరామర్శించారు. ఎన్నికల్లో గెలిస్తే.. అభివృద్ధిపై దృష్టి పెట్టాలి గానీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటుందన్నారు. గొడవలతో ఇరు పార్టీల కార్యకర్తలు జీవితాలు నాశనం చేసుకోవద్దని చదలవాడ సూచించారు.
'తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు సరికాదు' - tdp
ఎన్నికల తర్వాత తెదేపా నాయకులు, కార్యకర్తలపై వివిధ రకాల కేసులు అక్రమంగా బనాయిస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.