వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలంలో నవరత్నాలు పథకం తప్ప.. దివ్యాంగులకు సంబంధించి ఒక్క కార్యక్రమాన్ని చేపట్టలేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించే వరకు వారు చేపట్టే అన్ని కార్యక్రమాలకు తెదేపా అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని హామీ ఇచ్చారు.
అధికారంలో ఉన్న సమయంలో దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ పథకాలను తెదేపా మంజూరు చేసిందని, వారేదైనా ఆందోళన చేపడితే అందుకు సంబంధించిన ప్రతినిధిని వారి వద్దకే పంపి సమస్యల పరిష్కారానికి కృషి చేశామని గుర్తు చేశారు. వైకాపా పాలనలో దివ్యాంగులు సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్డెక్కడం బాధకరమన్నారు.
ఇవీ చూడండి: