ETV Bharat / state

Ex Minister Kollu Ravindra Cycle Yatra Stopped by Police: ప్రతిపక్షనేతలపై పోలీసుల దౌర్జన్యం.. కొల్లు రవీంద్రను పలు స్టేషన్లు తిప్పుతూ.. - Chandrababu Arrest

Ex Minister Kollu Ravindra Cycle Yatra Stopped by Police: రాష్ట్రంలో పోలీసులు ప్రతిపక్ష నేతల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆయన సైకిల్​ యాత్ర చేపట్టగా.. పోలీసులు అడ్డుకున్నారు. కేవలం అడ్డుకోవటం మాత్రమే కాకుండా అజ్ఞాతంలోకి తీసుకెళ్లి.. రోడ్లపై తిప్పి చివరకి ఆయన నివాసం వద్ద వదిలి వెళ్లిపోయారు.

Ex_Minister_Kollu_Ravindra_Cycle_Yatra_Stopped_by_Police

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2023, 12:55 PM IST

Ex Minister Kollu Ravindra Cycle Yatra Stopped by Police: ప్రతిపక్షనేతలపై పోలీసుల దౌర్జన్యం.. కొల్లు రవీంద్రను పలు స్టేషన్లు తిప్పుతూ..

Ex Minister Kollu Ravindra Cycle Yatra Stopped by Police: తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కొల్లురవీంద్ర అరెస్టు తీరుపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని.. తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. నిన్న ఉదయం కొల్లు రవీంద్రను అరెస్టు చేసిన పోలీసులు అర్ధరాత్రి వరకు వివిధ స్టేషన్లు తిప్పుతూ.. చివరకు మచిలీపట్నంలోని ఆయన నివాసం వద్ద వదిలి వెళ్లారు. పోలీసుల తీరును ఖండించిన కొల్లు.. వారిపై న్యాయపోరాటం చేస్తానన్నారు.

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా సోమవారం మాజీమంత్రి కొల్లు రవీంద్ర సైకిల్ యాత్ర చేపట్టారు. యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని నాగాయలంక స్టేషన్‌కు తరలించారు. కొల్లు రవీంద్రకు మద్దతుగా వెళ్లిన మండలి బుద్ధ ప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ ను పోలీసులు అరెస్టు చేసి.. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు పోలీస్ స్టేషన్​కి తరలించారు.

Kollu Ravindra about Rape Incident: డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి.. అందుకే పోలీసుల హైడ్రామా: కొల్లు రవీంద్ర

రవీంద్రకు సంఘీభావంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసు స్టేషన్ వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. దీంతో కొల్లు రవీంద్రకు నోటీసులు ఇచ్చి తిరిగి బందరు తీసుకెళ్లి వదిలేస్తామని పోలీసులు తెలిపారు. కానీ, అలా చేయకుండా అర్ధరాత్రి వరకూ నిడమోలు, కూచిపూడి, నాగాయలంక ప్రాంతాల్లో తిప్పారు. కొల్లు రవీంద్ర అదృశ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు హౌజ్ మోషన్ పిటిషన్ కు సిద్ధమయ్యారు.

నాగాయలంక స్టేషన్‌ నుంచి కొల్లును తీసుకువెళ్లిన పోలీసులు.. వెనుక వస్తున్న అనుచరుల వాహనాలను దారి మళ్లించి ఆయన్ను అజ్ఞాతంలోకి తీసుకు వెళ్లారు. తన తండ్రి ఆచూకీ తెలపాలంటూ కొల్లు రవీంద్ర కుమారుడు.. పునీత్ చంద్ర జిల్లా ఎస్పీని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. కృతివెన్ను పోలీస్ స్టేషన్​లో కొల్లు రవీంద్రను ఆయన అనుచరులు కనుగొనడంతో.. పోలీసులు మళ్లీ అక్కడ నుంచి మచిలీపట్నం వైపు తరలించారు. చివరకు మచిలీపట్నంలోని ఆయన నివాసం వద్ద వదిలివెళ్లారు.

TDP Leaders Protest on Chandrababu Arrest: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతల ఆందోళనలు.. ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణుల అరెస్టులు

ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రోడ్లపై తిప్పుతూ.. పోలీసులు తన పట్ల దారుణంగా వ్యవహరించారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలపై ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

-కొల్లు రవీంద్ర, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు

కొల్లు రవీంద్ర ఆచూకీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఆరా తీశారు. సైకిల్ యాత్ర చేస్తున్న మాజీ మంత్రిని ఇంతగా వేధిస్తారా అని మండిపడ్డారు. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు మినహా వైసీపీ ప్రభుత్వంలో పాలన కనిపించడం లేదని దుయ్యబట్టారు. ఎవరికి చెప్పకుండా రహస్య ప్రాంతాల్లో తిప్పాల్సిన అవసరం ఏముందని.. ఆయన చేసిన తప్పేదంటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

TDP Manifesto: మేనిఫెస్టోలో మహిళలు, యువత, రైతులకు అధిక ప్రాధాన్యం: టీడీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.