- వైద్యులపై రాష్ట్ర ప్రభుత్వానికి మీరు లేఖ రాయడానికి గల కారణాలేంటి.?
కరోనా వల్ల ముగ్గురు వైద్యాధికారులను మేం కోల్పోయాం.. చనిపోయన వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి హామిని ఇప్పటివరకు ఇవ్వలేదు. పరిహారం అందించలేదు. మిగతా వైద్యులకు కూడా ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. ఇతర రాష్ట్రాలైన దిల్లీ, చత్తీస్గడ్, ఒడిశా ప్రభుత్వాలు అందించినట్లు ..మాకు కూడా కోటి రూపాయల పరిహారం అందిస్తే కొంతవరకు ఆదుకున్నవాళ్లవుతారు.
- వైద్యులకు క్షేత్రస్థాయిలో ఏవిధంగా రక్షణ సదుపాయాలున్నాయి..?
వీటికి గురించి మేమేప్పుడు అడగలేదు. ఇలాంటి పరిస్థితులలో సదుపాయాలున్న లేకపోయిన ..మేం ప్రజలకు సేవ చేయాలి. కానీ ప్రభుత్వం మాకు తెలియని యాప్‌లతో...రికార్డులు జతపరుచాలంటూ..రివ్యూలు, రిపోర్టుల పేరుతో అధికారులు మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. కరోనా వల్ల 60- 70% సిబ్బందితో పనిచేస్తున్నాము. ఇంతే మందితో వారడిగిన ఫలితాలను మేము ఇవ్వలేం. ఇలా ఇవ్వలేకపోవడం వలన మేము అవమానాలు, అవహేనలు, బెదిరింపులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కరోనా పరిస్థితులలో వైద్యులు మానసిక ఒత్తిడికి గురవడం మంచిది కాదు. మేము ప్రభుత్వానికి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం..కానీ ప్రభుత్వం మానవతాధృక్పథంతో ఆలోచించి సమస్యలను పరిష్కారించాలని కోరుతున్నాం.
- కొన్ని జిల్లాలో డీఎంహెచ్ఓలకు రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా..? మీరు లేఖలో ప్రస్తావించినట్లు ఏవిధమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు..?
ఉన్నాయి. డీఎంహెచ్ఓలు..మిగతా డిపార్ట్మెంట్లతో కలిసి పనిచేస్తారు. వారిని అవమానిస్తున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వ్యవస్థపై కామెంట్ చేస్తే ఊరుకోబోము. కొంతమంది రాష్ట్రస్థాయి అధికారులు వారానికి రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్‌ల పేరుతో..మాకు అనుభవంలేని 22 యాప్‌లతో వివరాలు సేకరించమంటే..ఎలా..? అన్ని జిల్లాల వైద్యాధికారులు ఇలాంటి బాధలే ఎదుర్కొంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే...సమస్యలు ఎదుర్కొంటారు. ప్రభుత్వం సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం.
ఇదీ చూడండి. చదివేది అగ్రికల్చర్ బీఎస్సీ .. ఆలోచనలేమో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సుకు వెళ్లేంత..!