ETV Bharat / state

'టెలీహెల్త్ సర్వీసెస్​తో మీకున్న సంబంధం ఏమిటీ?' - అచ్చెన్నాయుడు కేసు తాజా వార్తలు

మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై.. అవినీతి నిరోధక శాఖ విచారణ ముగిసింది. మూడు రోజులకు కలిపి మొత్తం 12 గంటలకు పైగా అచ్చెన్నను అధికారులు ప్రశ్నించారు. మరోవైపు ఆయన రిమాండ్ గడువు జులై 10 వరకు పొడిగించింది అనిశా న్యాయస్థానం.

acb achenna
'టెలీహెల్త్ సర్వీసెస్​తో మీకున్న సంబంధం ఏమిటీ?'
author img

By

Published : Jun 27, 2020, 9:37 PM IST

Updated : Jun 28, 2020, 4:23 AM IST

ఈఎస్​ఐ కేసులో మాజీమంత్రి అచ్చెన్నాయుడిపై మూడురోజుల పాటు సాగిన అ.ని.శా. విచారణ ముగిసింది. మూడు రోజుల్లో మొత్తం 12 గంటలకు పైగా అచ్చెన్నాయుడిని విచారించారు. ప్రధానంగా టెలీ హెల్త్‌ సర్వీసుల టెండర్లకు సంబంధించి రాసిన సిఫారసు లేఖలపైనే ఎక్కువ ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఈఎస్​ఐ ఆస్పత్రులకు అవసరమైన సేవలు, పరికరాలను తెలంగాణ ప్రభుత్వానికి సరఫరా చేశామని...ఏపీలోనూ మంచి సేవలు అందిస్తామని టెలీ సర్వీసెస్‌ సంస్థ సంప్రదించడం వల్లే అధ్యయనం చేయాలంటూ సిఫారసు లేఖ ఇచ్చానని అచ్చెన్నాయుడు వెల్లడించినట్లు తెలుస్తోంది. మంత్రిగా తాను సిఫారసు లేఖ మాత్రమే రాశానని...దానిపై చట్టబద్ధంగా నిర్ణయం తీసుకోవాల్సింది అధికారులేనని ఆయన అనిశాకు చెప్పినట్లు సమాచారం. దాదాపు 3రోజుల విచారణ మొత్తం ఈ లేఖ చుట్టే తిరిగినట్లు తెలిస్తోంది. ఆ లెటర్ లో "మై ఆర్డర్" అనే పదాన్ని వాడటం వెనుక ఉద్దేశాన్ని అనిశా అధికారులు ప్రశ్నించారు.

నిర్ణయాధికారం అధికారులదే...

టెలీ హెల్త్ సర్వీసెస్ గుత్తేదారుతో అచ్చెన్నాయుడికి ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. ఆ సంస్థ.. టెలీ హెల్త్ సర్వీసు పేరిట రాష్ట్రంలో కార్మికులందరి పేరున బిల్లులు డ్రా చేసిందని అనిశా ఆరోపించింది. ఆ సంస్థ నుంచి ఇచ్చిన కాల్ లిస్టు చూస్తే..... చాలా ఫోన్ కాల్స్ తెలంగాణ నుంచే ఉన్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. ఒక్కో ఫోన్ కాల్ కు రూపాయి 80 పైసలు చొప్పున బిల్లులు వసూలు చేసినట్లు ఆరోపణ. ఈసీజీ సేవలకు సంబంధించి ఒక్కో పరీక్షకు 480 రూపాయలు బిల్లులు వసూలు చేశారని.. బయట మార్కెట్లో ఈ ధర 250 రూపాయలు ఉంటుందని అనిశా అధికారుల అభియోగం. తెలంగాణలో ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోగా.... రాష్ట్రంలో మాత్రం సదరు సంస్థకు 8 కోట్లు చెల్లించడంపై ఆరా తీశారు. మంత్రిగా ఎన్నో సిఫారసు లేఖలు ఇస్తామని... నిర్ణయాధికారం అధికారులదేనని అచ్చెన్నాయుడు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మినిట్స్‌పై సంతకం తప్ప కొనుగోళ్ల దస్త్రం తన వద్దకు రాలేదని కొనుగోళ్లు, చెల్లింపుల సమయానికి తను మంత్రిగా లేనని అచ్చెన్నాయుడు అనిశాకు వివరించినట్లు సమాచారం.

బలవంతంగా ఒప్పించే ప్రయత్నం...

అచ్చెన్నాయుడిపై అభియోగాలు రుజువు చేసేందుకు అనిశా అధికారులు శతవిధాల ప్రయత్నించారని ఆయన తరపు న్యాయవాది మండిపడ్డారు. బలవంతంగా ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేశారన్న న్యాయవాది...రాజకీయంగా ఆయన్ను దెబ్బతీసేందుకు కుట్ర జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అచ్చెన్నాయుడి రిమాండ్ గడువు జులై 10 వరకు అనిశా ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది.

ఇదీ చదవండి..

'కాపు రిజర్వేషన్​.. ఓట్లు దండుకునే మంత్రదండంగా మారింది'

Last Updated : Jun 28, 2020, 4:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.