ETV Bharat / state

ROSA: రోసా నిబంధనల మార్పు.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు

Employees on ROSA Rules: రోసా నిబంధనలు మార్పు చేర్పులపై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలో... భిన్నఅభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రోసా నిబంధనలు సమూలంగా మార్చాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది.

Employees on ROSA Rules
Employees on ROSA Rules
author img

By

Published : Apr 20, 2023, 8:01 AM IST

Updated : Apr 20, 2023, 12:13 PM IST

రోసా నిబంధనల మార్పు.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు

Employees on ROSA Rules: రోసా నిబంధనలను సమూలంగా మార్చాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.ఆర్​.సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం అర్హతతో సంబంధం లేకుండా తమకు కావాల్సిన సంఘాలకు గుర్తింపు ఇచ్చేలా ప్రభుత్వానికి వెసులుబాటు ఉందని తెలిపారు. ఈ వెసులుబాటు లేకుండా ఉండాలంటే రోసా రూల్స్ మార్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎంపిక చేసుకునే విధానాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఏ సంఘానికి ఆ సంఘం అని కాకుండా.. అందరికీ కలిపి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరపాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామని వెల్లడించారు. రోసా రూల్స్ మార్పు చేర్పుల మీదే కాకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నిబంధనలను కూడా మార్చాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. చాలా ఉద్యోగ సంఘాల్లో ద్వంద్వ సభ్యత్వం ఉందన్న అయన ఇది తప్పుడు విధానం అని.. దీన్ని సరిద్దిదాలని కోరతామన్నారు.

నిబంధనల్లో మార్పులు చేర్పులు అవసరం లేదు: రోసా రూల్స్ మార్చాల్సిన అవసరం లేదని వాటిని యథాతథంగా కొనసాగించి సక్రమంగా అమలు చేయాలని ఏపీ ఎన్జీఓ నేత బండి శ్రీనివాసరావు కోరారు. ప్రస్తుతమున్న రూల్సును సమూలంగా మార్చాలని కొన్ని సంఘాలు చేస్తున్న వాదన సరైంది కాదన్నారు. ఇంటిలో ఎలుక దూరిందని.. ఇంటిని తగులపెట్టుకోవడం సరైన పని కాదని.. ఎలుకను తరిమి కొట్టాలని తాము అధికారులకు చెప్పామన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, పండిత పరిషత్ సంఘాలకు నిబంధనలు అతిక్రమించి.. రిలాక్సేషన్ తీసుకుని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోకి వచ్చాయన్నారు. ఉద్యోగులందరికీ ఉమ్మడిగా ఎన్నికలు జరగాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ట్రేడ్ యూనియన్ సంఘాల మాదిరిగా ఉద్యోగ సంఘాలకు ఉమ్మడి ఎన్నికలు జరగవని తెలిపారు.

"రోసా నిబంధనలు యథాతథంగా అమలుచేయాలని కోరాం. పలుకుబడితో వచ్చి, నిబంధనలు అతిక్రమించి, సడలింపు పొందిన సంఘాలు.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఆపస్‌ ఉన్నాయి. వాటిని రద్దు చేయాలి. ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నాం. ఆర్టీసీలో ఎన్‌ఎంయూ, ఈయూ సంఘాలకు గుర్తింపు ఇచ్చారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలకే ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలకు ఎన్నికలు జరగవు"-బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస ఛైర్మన్‌

ద్వంద్వ సభ్యత్వాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు: ద్వంద్వ సభ్యత్వం అంటూ కొన్ని సంఘాలు కొత్త వాదనను తెర లేపుతున్నాయని ఏపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయ రాజు అన్నారు. కొన్ని సంఘాల్లో ప్రత్యేకంగా వారి వారి సమస్యల గురించి పోరాడతాయని తెలిపారు. అలాగే ఉమ్మడి సమస్యలపై వేరే సంఘాల్లోనూ సభ్యత్వం ఉంటుంది.. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు.

"ప్రతి ప్రభుత్వశాఖలో ఓ సంఘం ఉంటుంది. రాష్ట్రస్థాయిలో ఉద్యోగులందరికీ చెందిన ఒకే రకమైన సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేసేందుకు జాయింట్‌ సంఘాలు ఉన్నాయి. ద్వంద్వసభ్యత్వం అనేది లేదు. ఓడీలు రద్దు చేయాలని కుతంత్రాలు చేస్తే ఏపీ ఐకాసలో అయిదు సంఘాలు అడ్డుకుంటాయి. రోసా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి. కొన్ని సంఘాలనే పిలిచి మాట్లాడటం తప్పు. ఈ సంఘాలకు ఉన్న ప్రొవిజన్స్‌ అమలుచేయాలని కోరాం"-హృదయరాజు, ఏపీ ఐకాస ప్రధాన కార్యదర్శి

రోసా నిబంధనల మార్పుచేర్పులపై సచివాలయంలో తొలి సమావేశం: రోసా నిబంధనలు మార్పు చేర్పులపై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల తొలి సమావేశం ముగిసింది. రోసా నిబంధనలు మార్పు చేర్పులపై ఉద్యోగ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. రోసా నిబంధనలు సమూలంగా మార్చాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. రూల్స్​ను సక్రమంగా అమలు చేస్తే చాలునని మార్పులు, చేర్పులు అవసరం లేదని ఏపీ జేఏసీ సహా ఇతర సంఘాలు తెలిపాయి. నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి పండిత పరిషత్ సంఘాలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చోటు కల్పించారని ఏపీ ఎన్జీవో సంఘం ఆరోపించింది. రోసా రూల్స్ మార్పు చేర్పులపై కమిటీ వేసిన రెండేళ్ల తర్వాత తొలిసారిగా భేటీ జరిగింది. రోసా రూల్స్ మార్పు చేర్పులపై అభిప్రాయాలు తెలిపేందుకు సోమవారం సాయంత్రంలోగా ఓ ప్రోఫార్మాను ఉద్యోగ సంఘాలకు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. అభిప్రాయాలు తెలియజేసేందుకు ప్రభుత్వం 15 రోజుల గడువు విధించింది.

ఇవీ చదవండి:

Last Updated : Apr 20, 2023, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.