ETV Bharat / state

నామినేషన్ వేయకుండా అడ్డంకులు.. అభ్యర్థుల ధర్నా - guntur district

గుంటూరు జిల్లా గురజాల నియోజక వర్గంలో నామినేషన్ వేయాల్సిన అభ్యర్థులు నిరసనకు దిగారు. ప్రక్రియకు అవసరమైన పత్రాల జారీ కావాలనే వాయిదా వేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు.

election nomination
election nomination
author img

By

Published : Nov 4, 2021, 5:29 AM IST

గుంటూరు జిల్లా గురజాల నియోజక వర్గంలో నామినేషన్ల పర్వం సాగుతోంది. ఈ క్రమంలో గురజాలలో నామినేషన్లు వేసేందుకు సిద్ధపడిన తెదేపా కార్యకర్తలకు ఇంటి పన్ను ధ్రువీకరణ పత్రం ఈరోజు.. రేపు ఇస్తామంటూ అధికారులు నమ్మబలికి మోసం చేశారని వాపోతున్నారు. ఇప్పటికీ ఎటువంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని, నామినేషన్ టైం ఒకరోజు గడిచిపోయిందని నగర పంచాయతీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. బాధ్యతగల ప్రభుత్వ ఉద్యోగి ఇలా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన సర్టిఫికెట్లు ఇప్పించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఎన్నికల బరిలో నుంచి తప్పించేదుకు.. నామినేషన్ దాఖలు చేయనీయకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని వారు అన్నారు.

ఇదీ చదవండి:

SUICIDE ATTEMPT: చిట్టీల విషయంలో గొడవ.. ఆపై ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.