ETV Bharat / state

Toll Free No.: పాఠశాలల్లో సమస్యలపై టోల్‌ఫ్రీ నంబర్​ ఏర్పాటు - AP Education department News

Toll-free number on issues in schools: ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించేందుకు విద్యాశాఖ టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసింది. మధ్యాహ్న భోజన పథకంలో భోజనం నాణ్యత, మరుగుదొడ్లు, పాఠశాలల నిర్వహణ, ఇతర అకడమిక్‌ అంశాలపై ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఫిర్యాదులు, అభిప్రాయాలు వెల్లడించేందుకు దీన్ని తీసుకొచ్చారు.

Toll-free number on issues in schools
Toll-free number on issues in schools
author img

By

Published : Feb 25, 2022, 7:30 AM IST

Toll-free number on issues in schools: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై అభిప్రాయాలు, ఫిర్యాదుల స్వీకరణకు పాఠశాల విద్యాశాఖ 14417 టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటుచేసింది. మధ్యాహ్నభోజన పథకంలో భోజనం నాణ్యత, మెనూ అమలు, మరుగుదొడ్లు, పాఠశాలల నిర్వహణ, విద్యాకానుక పంపిణీ, నాణ్యత, ఉపాధ్యాయుల గైర్హాజరు, నాణ్యమైన బోధన, ఇతర అకడమిక్‌ అంశాలపై ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఫిర్యాదులు, అభిప్రాయాలు వెల్లడించేందుకు దీన్ని తీసుకొచ్చారు.

గిరిజన వసతిగృహాల మెనూలో కోత

గిరిజన సంక్షేమ వసతి గృహాల మెనూలో అధికారులు కోత విధించారు. విద్యార్థులకు ఇది వరకు వారానికి ఆరు రోజులు గుడ్డు, ఏడు రోజులు పాలు అందించేవారు. సవరించిన మెనూలో వారానికి నాలుగు రోజులు మాత్రమే గుడ్డు, పాలు అందించేలా మార్పు చేశారు. గతంలో వారంలో ప్రతిరోజూ అరటిపండునిచ్చేవారు. ప్రస్తుతం వారానికి మూడు రోజులు మాత్రమే అందించాలని నిర్ణయించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూలో మార్పులు చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి తెలిపారు.

పాఠశాలల మధ్యాహ్న భోజనంలోనూ మార్పు..

మధ్యాహ్న భోజన పథకం మెనూను మార్చుతూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మార్చి ఒకటో తేదీ నుంచి ప్రతి శుక్రవారం పొంగలి, సాంబారు, కోడిగుడ్లు అందించాలని సూచించింది. అన్నం వడ్డించే స్థానంలో వీటిని పెట్టాలని పేర్కొంది.

ఇదీ చదవండి:

ys viveka murder case : 'వివేకా మృతదేహాన్ని తొలుత చూసింది వాళ్లే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.