ETV Bharat / state

పిచికారీ యంత్రం.. సులువైన మంత్రం - గుంటూరు జిల్లా ముఖ్యాంశాలు

గుంటూరు జిల్లా నాగభైరువారిపాలెం గ్రామానికి చెందిన సయ్యద్‌ సుభానీ, చిన సుభానీ అనే రైతు సోదరులు పంటలకు పురుగు మందులను తక్కువ ఖర్చుతో పిచికారీ చేసేందుకు ‘బైక్‌ మౌంటెడ్‌ స్ప్రేయర్‌’ను తయారు చేశారు. ద్విచక్ర వాహనంపై నుంచి పిచికారీ చేసిన మందు 15 అడుగుల దూరం వరకు పడుతుంది. ‘దీని ద్వారా  15 నిమిషాల్లో ఎకరం పంటకు మందు చల్లవచ్చు.

బైక్ మౌంటెడ్ స్ప్రేయర్​తో పిచికారీ చేస్తున్న చిన సుభాని

author img

By

Published : Feb 13, 2021, 7:03 AM IST

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగభైరువారిపాలెం గ్రామానికి చెందిన సయ్యద్‌ సుభానీ, చిన సుభానీ అనే రైతు సోదరులు పంటలకు పురుగు మందులను తక్కువ ఖర్చుతో పిచికారీ చేసేందుకు ‘బైక్‌ మౌంటెడ్‌ స్ప్రేయర్‌’ను తయారు చేశారు. మోటార్‌ సైకిల్‌కి 12 వోల్టుల బ్యాటరీ, 50 వాట్ల సోలార్‌ ప్యానల్‌, 100 పీఎస్సై మోటారులు నాలుగు, 15 అడుగుల జింక్‌ పైప్‌కి 8 నాజిల్స్‌ అమర్చారు. 30 లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ పైపులు వాహనం చుట్టూ (బ్యాలెన్స్‌ కోసం) ఏర్పాటు చేసి దీనిని రూపొందించారు. ద్విచక్ర వాహనంపై నుంచి పిచికారీ చేసిన మందు 15 అడుగుల దూరం వరకు పడుతుంది. ‘దీని ద్వారా 15 నిమిషాల్లో ఎకరం పంటకు మందు పిచికారీ చేయవచ్చు. ఇందుకు అరలీటరు పెట్రోలు ఖర్చవుతుంది. దీని తయారీకి రూ. 20 వేలు ఖర్చుచేశాం’ అని సయ్యద్‌ సుభానీ, చిన సుభానీ సోదరులు తెలిపారు. గతంలో వీరు తయారు చేసిన భూమ్‌ స్ప్రేయర్‌ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదైంది.

ఇదీ చదవండి:

అరకు ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.