.
పులకించిన పుడమి దుర్గ! - guntur latest news
పచ్చటి వరిచేలో విభిన్న వర్ణ మొక్కలతో రూపొందిన దుర్గమ్మ తల్లి, రాట్నం తిప్పే జాతిపిత గాంధీజీల చిత్తరువులను చూసిన స్థానికులు భక్తితో నమస్కరిస్తున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోటకు చెందిన రైతు బాపారావు తన పొలంలో వెద పద్ధతిలో వరి వేశారు. ఆ సమయంలో ఆయన సాధారణ వంగడాలతోపాటు చిత్తరువులకు అనుగుణంగా మరో వర్ణంలో మొక్కలు కన్పించేలా వేరే వంగడాలనూ విత్తారు. 2 నెలల తరువాత పంట పొలంలో ఈ రూపాలు కనువిందు చేస్తున్నాయి.
durga maata in fields
.