ETV Bharat / state

వరదాగ్రహం... అన్నదాతకు తీరనినష్టం - flood

వర్షాలు అన్నదాతను నట్టేటా ముంచేశాయి. వరదల రూపంలో వచ్చి... పంటలను నీట ముంచాయి. కళ్లముందే పంట నీటిపాలు కావడం రైతును కలచివేస్తోంది.

రైతులు
author img

By

Published : Aug 18, 2019, 6:57 PM IST

వరద ప్రభావం.... ఎకరాకు రూ.లక్షకు పైగా నష్టం

కృష్ణానది వరదలతో గుంటూరు జిల్లాలోని కృష్ణా డెల్టాలో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. భారీ వరద ప్రవాహం ముంచెత్తటంతో పసుపు, కంద, అరటి, దొండ, మొక్కజొన్న, తమలపాకు పంటలు నీట మునిగాయి. వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో అనుకోని వరదలు రైతులను దారుణంగా దెబ్బతీశాయి. ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టామని రైతులు అంటున్నారు. కొన్నిరోజుల వ్యవధిలోనే అతివృష్టి, అనావృష్టిని చవిచూశామని అంటున్నారు. ప్రభుత్వం కనికరించి.. ఎకరాకు కనీసం 30- 40 వేల వరకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్.

యాంకర్.... గుంటూరులో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా రెండు గంటల నుండి వర్షం కురవడంతో నగరంలో ఎక్కడచూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. భారీగా రహదారులపై నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.కష్టాలు తాళలేక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు యూజీడి పనులు పై దృష్టి సారించాలని కోరుతున్నారు.

Body:బైట్....రామకృష్ణ..నగర వాసులు.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.