కరోనా లాక్డౌన్ కారణంగా మూగజీవాలు ఆకలితో అల్లాడుతున్నాయి. ప్రజలు ఎవరూ బయటకు రాకపోవటంతో శునకాలు ఆహారం లేక ఇబ్బంది పడుతున్నాయి. గమనించిన గుంటూరు నగరపాలక సంస్థ శానిటరీ ఇన్‌స్పెక్టర్ విజయభాస్కర్ వాటి ఆకలి తీర్చే కార్యక్రమం చేపట్టారు. విధులకు వెళ్లే సమయంలో తన వెంట బిస్కెట్ ప్యాకెట్లను తీసుకువెళ్లి... శునకాలు కనిపించిన చోట ఆగి.. వాటికి బిస్కట్లు పెట్టి ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదీ చదవండి: