ETV Bharat / state

అమరావతి రైతులకు చీరాల డీఎస్పీ హెచ్చరిక.. పర్చూరులో ఉద్రిక్తత

ప్రకాశం జిల్లాలోకి అమరావతి రైతుల పాదయాత్ర ప్రవేశించిన తొలిరోజే పోలీసులు ఆంక్షలు విధించారు. పాదయాత్రలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ.. రైతు ఐకాసకు చీరాల డీఎస్పీ నోటీసులు ఇచ్చారు.

అమరావతి రైతులు
అమరావతి రైతులు
author img

By

Published : Nov 6, 2021, 8:27 PM IST

ప్రకాశం జిల్లాలోకి అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రవేశించిన తొలిరోజే పోలీసులు ఆంక్షలు విధించారు. పాదయాత్రలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ రైతు ఐకాసకు పర్చూరు జంక్షన్‌లో చీరాల డీఎస్పీ నోటీసులు ఇచ్చారు. హైకోర్టు, డీజీపీ విధించిన షరతులను రైతులు ఉల్లంఘించినట్టు పేర్కొన్నారు. 6వ రోజు పాదయాత్ర ముగిసిన తర్వాత రైతులు బస చేసిన కల్యాణ మండపం వద్దకు చేరుకున్న డీఎస్పీ.. అమరావతి ఐకాస నేతలు శివారెడ్డి, తిరుపతిరావు, సుధాకర్‌, పలువురు ప్రజాప్రతినిధులకు నోటీసులు అందజేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

పాదయాత్ర పర్చూరుకు చేరిన సమయంలో ఉద్రిక్తత ఏర్పడింది. పర్చూరు వై.జంక్షన్‌ వద్ద మహాపాదయాత్ర వాహనాలను ఓ వ్యక్తి ఫొటోలు తీయడం ఉద్రిక్త పరిస్థితికి కారణమైంది. ఫొటోలు ఎందుకు తీస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటోలు తీసిన వ్యక్తితో అమరావతి రైతులు వాగ్వాదానికి దిగారు. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు ఫొటోలు తీసిన వ్యక్తి కానిస్టేబుల్‌ అని రైతులకు సర్ది చెప్పారు. సదరు వ్యక్తిని పోలీసు జీపులో ఎక్కించి అక్కడి నుంచి పంపించి వేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.

ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో.. జోరుగా అమరావతి మహా పాదయాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.