Drunken Weerangam in Guntur District: గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం ఎములూరి పాడు గ్రామానికి చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో నానా రచ్చ చేశాడు. గట్టి గట్టిగా కేకలు వేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తూ వీరంగం సృష్టించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ''గత మూడు రోజులుగా పిరంగిపురంలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ఎములూరి పాడు గ్రామానికి చెందిన ఓ యువకుడు పిరంగిపురం తిరునాళ్లకొచ్చి, బాగా మద్యం తాగాడు. ఆ మద్యం మత్తులో తిరునాళ్లకొచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ వీధుల్లో వీరంగం చేశాడు.'' అని వెల్లడించారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పిరంగిపురం పోలీసులు..ఆ తాగుబోతుని పోలీస్ స్టేషన్‌కి తరలిస్తుండగా పోలీస్ వాహనం వెనక అద్దాన్ని పగలకొట్టాడు. దీంతో ఆగ్రహించిన అధికారులు బలవంతంగా ఆ యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి