అమరావతి ప్రాంతంలోని లింగాయపాలెం గ్రామానికి విజయవాడ, గుంటూరుతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి మందుబాబులు తరలివస్తున్నారు. గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. లింగాయపాలెం గ్రామానికి చుట్టుపక్కల గ్రామాల్లోనూ కరోనా కేసులు నమోదవటంతో అక్కడి దుకాణాలు మూసివేయించారు. దీంతో ఎక్కడెక్కడి నుంచో మందుబాబులు లింగాయపాలెం వస్తున్నారు
మద్యం కొనుగోలుకు ఆధార్ కార్డులు.... ఇతర అనుపతి పత్రాలు ఉండాలనే షరతులేవి లింగాయపాలెం దుకాణం వద్ద లేకపోవటంతో మద్యంప్రియులు బారులు తీరుతున్నారు. సామాజిక దూరం మాటను పూర్తిగా పక్కనపెట్టేశారు. మాస్క్‌లు కూడా కొందరే ధరిస్తున్నారు.
ఇదీ చూడండి: అయ్యన్నపాత్రుడిపై కేసు: అరెస్టుపై స్టే ఇచ్చిన హైకోర్టు