ETV Bharat / state

డ్రాగన్ పండు: పోషకాలకు సన్నిది.. రైతుల పాలిట పెన్నిది

ఎపుడూ సంప్రదాయ పంటలు వేసి, నష్టాలతో విసుగెత్తిన ఆ రైతు.. సరికొత్తగా ఆలోచించాడు. తమ ప్రాంతంలో ఎవరూ సాగుచేయని, నష్టాల శాతం తక్కువగా ఉన్న సరికొత్త సాగును అందరికీ పరిచయం చేయాలనుకున్నాడు. కొంచెం పెట్టుబడులు ఎక్కువైనా ధైర్యం చేసి ముందడుగు వేశాడు. దీంతో రైతు ఆలోచన పండింది. మూడేళ్లుగా మంచి ఫలసాయం పొందుతూ లాభాలు అర్జిస్తున్నాడు. ఇంతకీ రైతు రాతను మార్చిన ఆ పంట ఏంటీ.. ఎలా సాగు చేయాలి.. ఎలాంటి లాభాలు వస్తాయి..? అనేటటువంటి మరిన్ని వివరాలు మీకు కావలంటే గుంటూరు జిల్లాలోని మేరికపూడి గ్రామానికి వెళ్లి.. రైతు నాగిరెడ్డిని పలకరించాల్సిందే...

Dragon fruit crop
డ్రాగన్ పండు సాగు చేస్తున్న రైతు నాగిరెడ్డి
author img

By

Published : Oct 28, 2020, 3:55 PM IST

మిర్చి, పత్తి పంటలు ప్రాణం పెట్టి సాగు చేసినా.. పెట్టుబడులు పెరిగి, దిగుబడులు రాక, అన్నీ ఉన్నా గిట్టుబాటు ధర లభించక ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న దుస్థితితో విసిగెత్తాడు. దీంతో ఆలోచనలో పడ్డ గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనే రైతుకు పల్నాడు ప్రాంతంలో తక్కువ నీటితో సాగు చేసే డ్రాగన్ పండు సాగు కంటపడింది. పెద్దగా పరిచయం లేని ఆ పంటను గుంటూరు వాసులకు రుచి చూపించాలి అనుకున్నాడు. కొంచెం పెట్టుబడి ఎక్కువైన ధైర్యం చేసి ముందడుగు వేశాడు. అనుకున్నదే తడువుగా డ్రాగన్ పండు సాగుకు అనువుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు.

ఇప్పటికే రెండు రకాల డ్రాగన్ పండ్లను నాగిరెడ్డి తోటలో పెంచుతున్నాడు. అందులో గులాబీ రంగు కాయలకు ఎక్కువగా డిమాండ్ ఉండటం.. ఎక్కువ ధర ఇచ్చి మరీ కొనుగోలుదారులు తీసుకుంటున్నారని నాగిరెడ్డి వాపోతున్నాడు. పంటను మార్కెట్ కు వెళ్లి వ్యాపారులకు అమ్మాలని చూస్తే కిలో 100, 150 రూపాయలకు అడుగుతుండటం.. తనే స్వయంగా పొలం పక్కనున్న రోడ్డుపై విక్రయిస్తున్నాడు. దీంతో కాయల పరిమాణం బట్టి కిలోకు 250 నుంచి 300 రూపాయలు వస్తోందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్లే మార్గం కావటం.. ఎక్కువ మంది వాహనాలు ఆపి పండ్లు కొనుగోలు చేస్తున్నారు. వీటిలోని పోషక విలువలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వినియోగదారులు తెలిపారు. షాపింగ్ మాల్స్ లో డ్రాగన్ పండ్లు దొరుకుతున్నా... ధర ఎక్కువగా ఉంటుంది. దీంతో తక్కువ ధరకే లభిస్తుండటంతో రైతు వద్ద కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఎడారి జాతి మొక్కలు కాబట్టి నీరు పెద్దగా అవసరం లేకపోవడం.. ఒకసారి వేస్తే 15 నుంచి 25 సంవత్సరాల వరకూ ఫలసాయం రావడం.. నిర్వహణ ఖర్చులు పెద్దగా లేకపోవడం డ్రాగన్ పండ్లు సాగులో రైతులకు కలిసోచ్చే అంశాలు.

ఇవీ చూడండి...

రైతులకు బేడీలు... ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.