గుంటూరు జిల్లా తెనాలిలో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని వాహన యజమానులు నిలిపివేశారు. వాయిదాల పేరుతో బ్యాంకర్లు తమ అకౌంట్ల నుంచి ఇష్టానుసారంగా డబ్బులు కట్ చేస్తున్నారని వారు ఆరోపించారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయం వద్దకు రేషన్ వాహనాలతో సహా వచ్చి ఆందోళన చేపట్టారు. నెలకు రూ.3 వేలు కట్ కావాల్సి ఉండగా..అంతకంటే ఎక్కువ కట్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కొందరికి 9 వేల రూపాయలు కూడా కట్ చేశారని..అలాంటప్పుడు తమకేం మిగులుతుందని ఆవేదన వెలిబుచ్చారు. తమ సమస్య పరిష్కరించిన తర్వాతే రేషన్ పంపిణీ చేపడతామని స్పష్టం చేశారు. అధికారులు తమ సమస్యని పరిష్కరించాలని కోరారు.
ఇదీ చూడండి. ‘హైకోర్టు తరలింపు’ మా పరిధిలోది కాదు