వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కడుపులో బిడ్డ చనిపోయిందని బాధితరాలు తల్లి, బంధువుల రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాన్పు కోసమని గుంటూరు లాలాపేటకు చెందిన లక్ష్మీ తన కూతుర్ని తీసుకుని వారం రోజులు క్రితం గుంటూరు సర్వజనాసుపత్రిలో చేర్పించింది. 3 రోజులు నుంచి కడుపులో నొప్పి తీవ్రంగా ఉందని వైద్యులకు చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవరించారని బాధితరాలి తల్లి లక్ష్మీ ఆరోపించింది. ఆలస్యంగా ఆపరేషన్ చేసి కడుపులో బిడ్డ చనిపోయిందన్నారని బాధితులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.
ఇదీ చూడండి