Do Not Change Central Scheme Name and Logo : కేంద్ర ప్రాయోజిత పథకాలకు తమ లోగో, పేరు యథాతథంగా ఉండాల్సిందేనని.. జగన్( Jagan) ముద్ర వేస్తే నిధులివ్వబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర పథకాల (Central Schemes) అమలుకుగాను కేంద్ర ప్రభుత్వ శాఖలు నిర్ధిష్టంగా జారీ చేసిన నిబంధనలను యథాతథంగా అమలు చేయాల్సిందేనని తేల్చి చెబుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. ఆ తదుపరే నిధులు విడుదల చేస్తామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు నిర్దేశించిన పేరు, లోగో, ఇతర వివరాల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకూడదని, వాటికి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పెట్టుకునే పేర్లు, ఇతర లోగోలు ఏవీ జత చేయకూడదని తెలిపింది. ప్రతి పథకానికి ఏఏ వివరాలు పొందుపరచాలో సూచిక బోర్డులతో సహా స్పష్టంగా నిర్దేశించింది.
4 Thousand Crore Rupees Stop by Central Government to Andhra Pradesh : రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కేంద్ర పథకాలకు సంబంధించి సుమారుగా 4వేల కోట్ల రూపాయలు నిలిపేసినట్లు తెలిసింది. కేంద్ర సహకారంతో నడిచే పథకాలను సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని కేంద్రానికి ఫిర్యాదు అందడంతో..ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర గృహనిర్మాణశాఖ, మహిళాశిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్యశాఖలకు ఈ లేఖలు అందినట్లు సమాచారం.
BJP Mahila Morcha నిధులు కేంద్రానివి.. జగన్ ఫోటోతో ప్రచారం! మండిపడిన బీజేపీ మహిళా మోర్చా..
Central Government Orders to YSRCP Government : రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల్లో (Jagananna Colony) దాదాపుగా 18 లక్షల 64 వేల గృహలు నిర్మిస్తోంది. వీటికిచ్చే నిధుల్లో మెజారిటీ కేంద్రానివే. ఒక్కో ఇంటి నిర్మాణానికిగాను లబ్ధిదారులకు అందే లక్షా 80వేల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా పట్టణాల్లో లక్షన్నర రూపాయలు ఇస్తోంది. పట్టణాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పథకంగా ప్రచారం చేసుకుంటోందనే విమర్శలు మొదటి నుంచీ ఉన్నాయి.
YSRCP Government Changed Central Schemes Names : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకానికి YSR పేరును జోడించి PMAY-YSR అర్బన్ బీఎల్‌సీ పథకంగా మార్చింది. పూర్తయిన ఇళ్లకు ఈ పేరుతోనే సూచిక బోర్డులను ఏర్పాటు చేయిస్తోంది. ఇందులోనే కేంద్ర ప్రభుత్వ లోగోను ముద్రించడంతో పాటు ముఖ్యమంత్రి జగన్ బొమ్మతో కూడిన నవరత్నలోగో కూడా ఉండాలని నిర్దేశిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు YSR, జగన్ పేర్లు పెట్టడంపై రాష్ట్ర బీజేపీ నేతలు కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారు. దీనిపై స్పందించిన కేంద్రం..YSR, జగనన్న, నవరత్న లోగోలు పెట్టడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది.
Central Schemes Names and Logo Changed by YSRCP Government in AP : స్థలానికి, ఇతర మౌలిక వసతులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు వెచ్చిస్తోందని కేంద్రం దృష్టికి రాష్ట్ర అధికారులు తీసుకెళ్లినా.. అంగీకరించనట్లు తెలిసింది. తాము సూచించిన పేరు, లోగో, లబ్ధిదారుని పేరు, ఆర్థిక సాయం, ఇతర వివరాలు మాత్రమే ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవేవీ ఉండకూడదని స్పష్టం చేసింది. ఇలా ఉంటేనే తదుపరి నిధులు విడుదల చేస్తామని పేర్కొంది. చేసేదేమీ లేక రాష్ట్ర ప్రభుత్వం YSR పేరును తొలగిస్తూ జీవోను విడుదల చేసింది.
ప్రాజెక్టులకు పేర్లు పెట్టడం కాదు.. వాటిని పూర్తి చేయాలి : గాదె వెంకటేశ్వరరావు
కేంద్ర బృందం పర్యటన : కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకు మాత్రమే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పూర్తయిన 5లక్షల గృహాల్లో ఏర్పాటు చేసిన సూచిక బోర్డుల్లోనూ నిబంధనల మేరకు మార్పులు చేస్తామని కేంద్రానికి నివేదించారు. ఈ ఇళ్ల తనిఖీకిగాను త్వరలో కేంద్ర బృందం పర్యటించనున్నట్లు తెలిసింది.
హడావుడిగా సూచిక బోర్డులను మార్చారు : గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (Pradhan Mantri Awas Yojana Scheme) కింద రాష్ట్రంలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఇటీవల 10 జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఈ పథకం కింద పూర్తయిన ఇళ్లకు ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను తనిఖీ చేసింది. కేంద్ర బృందం పర్యటనపై ముందుగానే సమాచారం ఉండటంతో ఆయా గృహలన్నింటికీ అప్పటికప్పుడు హడావుడిగా సూచిక బోర్డులను మార్పులు చేయించింది. YSR పేరు, నవరత్న లోగో లేకుండా కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు పర్యటించిన కేంద్ర బృందం పరిశీలన వివరాలను కేంద్రానికి నివేదించింది. దీని ఆధారంగానే తదుపరి నిధులు విడుదల కానున్నాయి.
నిధులు నిలుపుదల చేసిన కేెంద్ర ప్రభుత్వం : మహిళా శిశు సంక్షేమశాఖలో ICDS, పోషణ పథకాలు కేంద్ర ఆర్థిక సహకారంతో అమలవుతున్నాయి. మిషన్ వాత్సల్య, మిషన్‌శక్తి పథకాలూ కేంద్ర సహకారంతో నడిచేవే. అంగన్‌వాడీ కేంద్రాల్లోని గిర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం కోసం కేంద్రం ఖర్చు చేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం YSR సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ అనే పేర్లతో అమలు చేస్తోంది. దీనిపై కూడా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసి నిధులు నిలుపుదల చేసినట్లు తెలిసింది. ఆయా పథకాలపై తీసుకున్న తదుపరి చర్యలను పేర్కొంటూ రాష్ట్ర మహిళాశిశు సంక్షేమశాఖ కేంద్రానికి నివేదించింది.
ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్పు.. జగన్ కుటిల బుద్ధికి నిదర్శనం: తెదేపా