ETV Bharat / state

కొల్లిశారద మార్కెట్​ తరలింపుపై వివాదం.. ఉన్నచోటే కొనసాగించాలని ఆందోళనలు

కొల్లిశారద మార్కెట్​ తరలింపు విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. కరోనా దృష్ట్యా మార్కెట్​ను ఏటుకూరు బుడంపాడు బైపాస్ వద్దకు మార్చాలన్న మార్కెట్ అధ్యక్షుడి నిర్ణయాన్ని.. కమిటీ సభ్యులు, కొందరు వ్యాపారులు వ్యతిరేకించారు.

కొల్లిశారద మార్కెట్
కొల్లిశారద మార్కెట్
author img

By

Published : Aug 9, 2021, 5:43 PM IST

గుంటూరు కొల్లిశారద మార్కెట్ లో విభేదాలు తలెత్తాయి. క‌రోనా వ్యాప్తి, తగ్గిన వ్యాపారం దృష్ట్యా ఈ మార్కెట్​ను ఏటుకూరు బుడంపాడు బైపాస్ వద్దకు మార్చాలని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నిర్ణయించారు. అందుకు వ్యాపారస్తులు, కమిటీ సభ్యులు నిరాకరించారు. క‌రోనా మహమ్మారి కారణంగా గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న ఈ మార్కెట్​ను గతంలోనే.. ఏటుకూరు బుడంపాడు బైపాస్ వద్దకు మార్చారు. క‌రోనా కేసులు తగ్గిన తర్వాత తిరిగి ఆర్టీసీ బస్సు స్టాండ్ ఎదుట కొనసాగిస్తున్నారు.

ఇప్పుడు మళ్లీ.. స్టాక్ దిగుమతికి సౌకర్యంగా లేదని, ఎగుమతిదారులు రావడం లేదని మున్సిపల్​ కమిషనర్​కు సమాచారం అందింది. సరుకు అంతా మిగిలిపోయి వ్యాపారం దెబ్బతింటోందని ఫిర్యాదులు అందాయి. అలాగే.. కరోనా మూడో వేవ్​ వస్తుందన్న ఊహాగానాలపైనా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ స్పందించి.. మార్కెట్​ను మరోసారి బుడంపాడు బైపాస్ వద్దకు మార్చాలని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణను కోరారు.

విషయం తెలిసిన కమిటీ సభ్యులు.. ప్రతిపాదనను వ్యతిరేకించారు. తరలించడానికి వీలు లేదంటూ ఆందోళనకు దిగారు. మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తన సొంత ప్రయోజనాల కోసం మార్కెట్​ను తరలించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దే మార్కెట్​ను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

FIRE ACCIDENT: మంచాలు తయారు చేసే కార్ఖానాలో అగ్ని ప్రమాదం.. రూ. 7 లక్షల నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.