ETV Bharat / state

Conflict: ధరణికోట ఇసుక స్టాక్ యార్డు వద్ద లారీ డ్రైవర్ల ఆందోళన - ఇసుక లోడింగ్‌పై జేపీ సంస్థకు, లారీ డ్రైవర్ల మధ్య వివాదం

గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట ఇసుక స్టాక్ యార్డు వద్ద ఇసుక లోడింగ్ విషయంలో జేపీ కన్​స్ట్రక్షన్​ నిర్వాహకులు.. లారీ డ్రైవర్లకు మధ్య వివాదం నెలకొంది. వరుస క్రమం లేకుండా ఇష్టం వచ్చిన వారికి లోడింగ్ చేస్తున్నారని జేపీ కన్​స్ట్రక్షన్​ నిర్వాహకులతో డ్రైవర్లు వాదనకు దిగారు.

ఇసుక లోడింగ్‌పై జేపీ సంస్థకు, లారీ డ్రైవర్ల మధ్య వివాదం

author img

By

Published : Aug 21, 2021, 1:56 PM IST

గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట ఇసుక స్టాక్ యార్డు వద్ద ఇసుక లోడింగ్ విషయంలో జేపీ కన్​స్ట్రక్షన్​ నిర్వాహకులు.. లారీ డ్రైవర్లకు మధ్య వివాదం నెలకొంది. ఇసుక లోడింగ్​కు రెండు మూడు రోజులు పడుతుందని డ్రైవర్లు ఆందోళనకు దిగారు. వరుస క్రమం లేకుండా ఇష్టం వచ్చిన వారికి లోడింగ్ చేస్తున్నారని జేపీ కన్​స్ట్రక్షన్​ నిర్వాహకులతో వాదనకు దిగారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కాకుండా ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇదేమని అడిగితే బెదిరింపులకు గురిచేస్తున్నారని లారీ డ్రైవర్లు వాపోయారు. ఇసుక లోడింగ్ విషయంలో నిబంధనలు పాటించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని డ్రైవర్లను శాంతింపజేశారు.

ఇదీ చదవండి

ys viveka murder case: 76వ రోజు విచారణ.. సమాచారమిస్తే రివార్డు ఇస్తామని సీబీఐ ప్రకటన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.