ETV Bharat / state

DIG: చంద్రబాబు ఇంటికి జోగి రమేశ్ అందుకే వెళ్లారు: డీఐజీ - చంద్రబాబు ఇంటిపై దాడి

చంద్రబాబు ఇంటి వద్ద ఘటనపై డీఐజీ వివరణ
చంద్రబాబు ఇంటి వద్ద ఘటనపై డీఐజీ వివరణ
author img

By

Published : Sep 20, 2021, 6:59 PM IST

Updated : Sep 20, 2021, 7:57 PM IST

18:51 September 20

చంద్రబాబు ఇంటి వద్ద ఘటనపై డీఐజీ వివరణ

చంద్రబాబు ఇంటి వద్ద ఘటనపై డీఐజీ వివరణ

ఈనెల 17న కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి వద్ద ఘటనపై ఎస్పీలు విశాల్ గున్నీ, ఆరిఫ్ హఫీజ్​తో కలిసి డీఐజీ త్రివిక్రమ్ వర్మ వివరణ ఇచ్చారు. చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికే ఎమ్మెల్యే జోగి రమేశ్ ఆయన ఇంటికి వెళ్లారని..దాడి చేయటానికి కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే జోగి రమేశ్ రాకపై పోలీసులకు ఎలాంటి సమాచారం లేదన్న డీఐజీ..అయినప్పటికీ  కరకట్ట మొదటి భద్రత అంచె వద్దే అడ్డుకున్నామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దాడి ఘటనంటూ బయట జరిగిన ప్రచారం అవాస్తవమన్నారు. పూర్తి నిరాధారంగా మీడియాలో కథనాలను ప్రసారం చేశారని డీఐజీ ఆరోపించారు.  

ముందుగా జోగి రమేశ్ కారుపైనే దాడి జరిగిందని.. ఎమ్మెల్యే రమేశ్ కారుపైన,తర్వాత డ్రైవర్ పై చెప్పులు, రాళ్లతో కొందరు దాడి చేశారనంటూ డీఐజీ వీడియోలను ప్రదర్శంచారు. డీజీపీ ఆఫీసులో లేరని తెలిసి కార్యాలయం వద్ద 70 మంది హడావుడి సృష్టించారని...ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చే విధానమిది కాదని అన్నారు. కరకట్ట ఘటనపై ఇరుపక్షాల ఫిర్యాదుల మేర విచారణ జరుగుతోందని.. సాక్ష్యాధారాలు సేకరిస్తున్నామని డీఐజీ త్రివిక్రమ్ వర్మ చెప్పారు.  

జోగి రమేశ్ వినతిపత్రం ఇచ్చేందుకే వెళ్లారు, దాడికి కాదు. ఎమ్మెల్యే జోగి రమేశ్ రాకపై పోలీసులకు సమాచారం లేదు. సమాచారం లేకున్నా జోగి రమేశ్‌ను ముందే అడ్డుకున్నాం. మాజీ సీఎం ఇంటిపై దాడి ఘటన పేరుతో ప్రచారం అవాస్తవం. ముందుగా జోగి రమేశ్ కారుపైనే దాడి జరిగింది. ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ను చెప్పుతో కొట్టేందుకు కొందరు యత్నించారు. ఎమ్మెల్యే జోగి రమేశ్‌ కారు అద్దాలను రాయితో పగలగొట్టారు. డీజీపీ ఆఫీసులో లేరని తెలిసి 70 మంది హడావిడి సృష్టించారు. వినతిపత్రం ఇచ్చేందుకు ప్రతిపక్ష నేతలు వచ్చే విధానమిది కాదు. ఇరుపక్షాల ఫిర్యాదులపై సాక్ష్యాధారాలు సేకరిస్తున్నాం. -తివ్రిక్రమ్ వర్మ, డీఐజీ

ఏం జరిగిందంటే..

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు.. ముఖ్యమంత్రి జగన్‌, హోం మంత్రి సుచరిత తదితరులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కార్యకర్తలతో కలిసి వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు. వారిని బుద్దా వెంకన్న సహా ఇతర తెదేపా నాయకులు ప్రతిఘటించారు. ఆ సమయంలో కొందరు వైకాపా కార్యకర్తలు తమ వెంట తెచ్చుకున్న జెండా కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇరువర్గాల మోహరింపుతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు బారికేడ్లు పెట్టి ఇద్దరినీ నిలువరించే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవటంతో లాఠీలు ఝళిపించారు.  

ఈ సమయంలో జోగి రమేశ్, బుద్ధా వెంకన్న మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రబాబు ఇంటి దగ్గర నిరసన ఎందుకు చేపడుతున్నారంటూ బుద్ధా నిలదీశారు. అదే సమయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య పరస్పర నినాదాలతో హోరెత్తించారు. ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాటలు చేటు చేసుకున్నాయి. ఈ క్రమంలో బుద్ధా వెంకన్న స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సొమ్మసిల్లి కిందపడిపోయారు. తెదేపా నాయకుల ప్రతిఘటనతో చేసేది లేక జోగి రమేశ్..కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలూ రాళ్లు రువ్వుకున్నాయి. ఎమ్మెల్యే జోగి రమేశ్ కారు రాళ్ల దాడిలో ధ్వంసం అయ్యింది. గొడవ మరింత పెరిగేలా ఉందని భావించిన పోలీసులు.. ఇరువర్గాల వారినీ చెదరగొట్టి జోగి రమేశ్​ను అరెస్టు చేశారు.  చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనపై ఇరు పార్టీలకు చెందిన నాయకులు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. 

ఇదీ చదవండి

CBN HOME: అయ్యన్న వ్యాఖ్యలపై వైకాపా ఆందోళన..చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

Last Updated : Sep 20, 2021, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.