కరోనా నేపథ్యంలో గ్రామాల్లో రహదారులపై గ్రామస్థులు, అధికారులు... బండరాళ్లు, ముళ్ల కంచెలు పెట్టి రాకపోకలు నిలిపేశారు. ఇది అత్యవసర ప్రయాణాలు చేసేవారికి ఇబ్బందిగా మారింది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పమిడివారిపాలెం వద్ద పొన్నూరు ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద బండరాళ్లు అడ్డుపెట్టారు. గ్రామస్థుల సహకారంతో ముళ్ల కంచెలు వేశారు. ఇప్పుడు అత్యవసర పనుల మీద వెళ్లేవారికి అవి ఆటంకంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో అంబులెన్స్‌లు వెళ్లే పరిస్థితి కూడా లేదు.
ఇవీ చదవండి: